Boycott Brahmastra: బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో కొంతమంది స్టార్లు చేసిన రచ్చకు ఈ బాయ్ కాట్ ట్రెండ్ ను మొదలుపెట్టారు ట్రోలర్స్. ఇక దీనివలన చాలా సినిమాలు నష్టపోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఈ బాయ్ కాట్ సెగ బ్రహ్మాస్త్రకు అంటింది. ఇప్పటి నుంచి ఏంటి ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండ్ అవుతూనే వస్తోంది. ట్రైలర్ లో గుడిలోకి రణబీర్ షూస్ వేసుకొని లోపలి వెళ్లాడంటూ మొదలుపెట్టిన హిందూ సంఘాలు ఇప్పటికీ ఈ సినిమాను వదలడం లేదు. ఇక ఇదే కాకుండా గతంలో రణబీర్ చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు అతనిని వెంటాడుతోంది అని చెప్పుకొస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో అలియా- రణబీర్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళీ తెంబిల్ ను దర్శించుకోవడానికి వెళ్లారు. అయితే దర్శనం కాకుండానే ఆ జంట తిరిగి వచ్చేసింది. ఎందుకంటే .. వారిని ఆలయంలో లోపలి పంపించబోయేది లేదని భజరంగ్ దళ్ సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఇందుకు కారణం.. గతంలో రణబీర్ చేసిన వ్యాఖ్యలే.. ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తనకు మటన్ అంటే ఇష్టమని దానికన్నా బీఫ్ తినడం ఇంకా నచ్చుతుందని, ఎక్కువగా తాను బీఫ్ తింటానని చెప్పుకొచ్చాడు. హిందువులు ఎంతో భక్తితో పూజించే ఆవులను అతడు తింటున్నాను అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని పవిత్రమైన ఆలయంలోకి ఎలా పంపిస్తామని భజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత అడ్డుకున్న అలియా- రణబీర్ లు మాత్రం లోపలి అడుగుపెట్టలేకపోయారు. దీంతో వారు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చేసిన తప్పు ఈ జంటను వదలడం లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇన్ని సమస్యల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకొంటుందో చూడాలి.