Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌పై చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, విదేశాల్లో మాత్రం ఈ ప్లాన్‌కు డబ్బింగ్ సమస్యలు గట్టి బ్రేక్ వేశాయి. ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ 16న ఓవర్సీస్లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ అధికారికంగా ప్రకటించింది. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల వెర్షన్లను వారం రోజుల పాటు వాయిదా వేసి, అక్టోబర్ 23 నుంచి మాత్రమే ప్రదర్శించనున్నట్లు పంపిణీదారులు స్పష్టం చేశారు. దీంతో పక్కా పాన్-ఇండియా లెక్కలతో ఓవర్సీస్లో మొదటి వారమే భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాలనుకున్న చిత్ర బృందానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి.
పెళ్లి తర్వాత విజయ్ – రష్మిక కలిసి నటిస్తున్న ఫస్ట్ సినిమా కావడం, గతంలో ‘టాక్సీవాలా’తో హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ గడ్డపై జరిగిన అమానవీయ ఘటనల నేపథ్యంలో, పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. డబ్బింగ్ లేట్ వల్ల నాన్ తెలుగు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి నిరాశ తప్పకపోయినా, ఓవర్సీస్లో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. మరి ఈ డబ్బింగ్ ట్విస్ట్‌ను దాటుకుని, కేవలం తెలుగు వెర్షన్‌తోనే ఫస్ట్ వీక్ ‘రణబాలి’ విదేశీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
- దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
- Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
#Ranabaali will release in TELUGU ONLY across Overseas Markets on October 16. (Premieres on Oct 15)
Overseas by @PharsFilm @PrathyangiraUS
@TheDeverakonda @iamRashmika #ArnoldVosloo @Rahul_Sankrityn @MythriOfficial @TSeries @RanabaaliFilm @PrathyangiraOS https://t.co/djuCB5JRPM
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 10, 2026
తాజావార్తలు
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!