Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabaali: టాలీవుడ్లో ఇప్పుడు కం బ్యాక్‌ల జోరుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ‘రణబలి’పై సినీ అభిమానుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉందంట. ఈ అప్డేట్లో కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రాన్ని 19వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కుతున్నారని సమాచారం. ఈ సినిమాను వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఆధారంగా చేసుకున్న యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. గతంలో విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రష్మిక మందన్న గాయపడటంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగిన కారణంగా.. ఈ సినిమా రిలీజ్‌కు అక్టోబర్‌కు మారే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీ మార్పుపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇప్పటికే ‘రణబాలి’ నుంచి విడుదలైన ‘ఏందయ్యా సామీ’ పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనుండటం కూడా కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రణబాలి’ నుంచి ఈ వారంలో అధికారిక ప్రకటన వస్తుందన్న వార్త నిజమేనా? విడుదల తేదీపై మేకర్స్ ఏం చెబుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
తాజావార్తలు
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..