Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన ఫిట్నెస్ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేశారు. జిమ్‌లో బార్‌బెల్‌తో డెడ్‌లిఫ్ట్స్ చేస్తున్న వీడియోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ‘‘మీ గరిష్ఠ బలంలో 70 శాతం దగ్గర ఆపేసినప్పుడు’’ అనే మెసేజ్ కనిపించింది. దీంతో సమంత వర్కౌట్ విధానం గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. ‘‘ట్రైనింగ్ అంటే ఇంకా ఎక్కువ కష్టపడటం కాదు.. మన శరీరం చెప్పేది బాగా వినడం’’ అనే అభిప్రాయాన్ని ఆమె పంచుకున్నారు. ప్రతిసారీ ఎక్కువ బరువులు ఎత్తడం, ఎక్కువగా వ్యాయామం చేయడం మాత్రమే ఫిట్నెస్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మన శరీర సామర్థ్యాన్ని గుర్తించి, దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలని సూచించారు.
అయితే తన వర్కౌట్ వీడియోను చూసి ఎవరూ అలాగే చేయకూడదని సమంత స్పష్టం చేశారు. తాను చాలా ఏళ్లుగా బరువులతో వ్యాయామం చేస్తున్నానని, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా డాక్టర్ అనుమతితోనే వర్కౌట్ కొనసాగిస్తున్నాని తెలిపారు. తన ట్రైనర్‌కు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామంపై ప్రత్యేక శిక్షణ ఉందని చెప్పారు. తాను చేసే ఎక్సైజ్‌లు తన శరీరం, అనుభవం, ప్రెగ్నెన్సీ పరిస్థితికి తగ్గట్టుగా మార్చుకుంటున్నానని సమంత వివరించారు. ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదని, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎవరి పరిస్థితి వారిదేనని చెప్పారు. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయాలనుకునేవారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే సరైన శిక్షణ ఉన్న నిపుణుల సలహాతోనే వర్కౌట్స్ చేయాలని సూచించారు. సమంత తాజా పోస్ట్ ద్వారా ఫిట్నెస్ అంటే శరీరాన్ని అతిగా ఒత్తిడి చేయడం కాదు.. శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అనే సందేశాన్ని ఇచ్చారు.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!