పేద కుటుంబానికి ప్రకాష్ రాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్

సౌత్ సీనియర్ నటుడు ఓ పేద కుటుంబం జీవితం మెరుగుపడడానికి తన వంతు సాయం చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలోని ఒక కుటుంబానికి తాను జేసీబీని బహుమతిగా ఇచ్చానని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన వారికి జేసీబీని అందజేసిన పోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ” ప్రకాష్ రాజ్‌ఫౌండేషన్ చొరవతో శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలో ఒక కుటుంబానికి జేసీబీతో సాధికారత కల్పించాం… వారి జీవితంలోకి ఆనందం తిరిగి వచ్చింది…” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ మంచి పనికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also : ఎట్టకేలకు సీఎం అపాయింట్మెంట్ దొరికింది !

ఇక గత నెల రోజులుగా ప్రకాష్ రాజ్ ‘మా’ ప్రెసిడెంట్ పదవి కోసం చేస్తున్న పోటీలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను అధికారికంగా ప్రకటించడమే ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా తన ప్యానల్ లో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమలను చేర్చుకుని షాక్ ఇచ్చారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ విభేదాల వల్ల బయటకు రావడం తెలిసిందే. ఆదివారం రోజు ‘మా’ సభ్యుల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన ప్రకాష్ రాజ్… ‘మా’ గురించి సభ్యులతో పలు విషయాలను చర్చించారు. కాగా అక్టోబర్ లో జరగనున్న ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం విదితమే.

Related Articles

Latest Articles

-Advertisement-