ఆఫ్ట్రాల్ ఎస్.ఐ అంటూ రానా గర్జన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 14 ఉదయం ‘భీమ్లా నాయక్’ నుండి అతను నటిస్తున్న డేనియల్ శేఖర్ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన చిత్ర బృందం సాయంత్రం ఓ డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని చూస్తే, “వాడు అరిస్తే భయపడతానా, ఆడికన్నా గట్టిగా అరవగలను… ఎవడాడు!? దీనమ్మ దిగొచ్చాడా!? ఆఫ్ట్రాల్ ఎస్. ఐ., సస్పెండెడ్….” అంటూ డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా చెప్పడం ఇందులో కనిపిస్తుంది. సస్పెండ్ అయిన ఎస్.ఐ.తో రానా కు ఉన్న పంచాయితీ ఏమిటీ అనేది తెలుసుకోవాలంటే జనవరి 12వరకూ వేచి చూడాల్సిందే.
మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ‘భీమ్లా నాయక్’కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నిత్యా మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీ శర్మ, సముతిరకని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ ఎస్.ఎస్. సంగీతం అందించాడు.
Also Read
- NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!