Rambha: ప్రస్తుతం నాటితరం నటీమణులు రీఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగి.. పెళ్లితో కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన హీరోయిన్స్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ బిజీగా మారుతున్నారు. అభిమానులు సైతం వారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. కుర్ర హీరోలకు అక్కగా, వదినగా.. ఇంకొంతమంది సీరియల్ లో కీలక పాత్రలుగా నటించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే రాశీ, లయ లాంటి వారు మంచి ఛాన్స్ లను అందుకుంటున్నారు. ఇక వీరి లిస్ట్ లో చేరిపోయింది అందాల భామ రంభ. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగు విజయవాడ అమ్మాయి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని.. వరుస అవకాశాలను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Japan: ఢిల్లీ కోసం ధరణి గాడు దిగుతున్నాడు..
ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇంద్రకుమార్ అనే వ్యక్తిని వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యింది. హీరోయిన్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టినా.. స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టింది. అంతేకాకుండా డ్యాన్స్ షోస్ లో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న రంభ.. రీఎంట్రీకి సిద్దమవుతుందని సమాచారం. ప్రస్తుతం ఒక స్టార్ హీరో సినిమాలో అమ్మడికి ఛాన్స్ వచ్చిందని టాక్ నడుస్తోంది. పెళ్లి తరువాత బొద్దుగా మారిన రంభ.. కష్టపడి బరువు తగ్గి స్లిమ్ గా మారింది. దీంతో హీరోకు అక్క, వదిన పాత్రల్లో చక్కగా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉన్నది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.