రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 1న రాత్రి 7:57 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ మూవీలో హీరో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Read Also: Meena: షాకింగ్.. నటి మీనా భర్త మరణానికి పావురాళ్లే కారణమా?
‘ది వారియర్’ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా హీరోరామ్ పోలీస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందాయి. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్‌కు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజిల్ సాంగ్ అయితే అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో కలుపుకుని 12 మిలియన్ ప్లస్ వ్యూస్‌ను సాధించింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ది వారియర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
𝙈𝙖𝙨𝙨 𝙏𝙨𝙪𝙣𝙖𝙢𝙞 𝘼𝙬𝙖𝙞𝙩𝙨 🔥⚔️
Bringing you the Surreal Mass Experience through #TheWarriorrTrailer
RAMpage starts on July 1st at 7:57 PM@RamSayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @srinivasaaoffl @adityamusic @masterpieceoffl pic.twitter.com/IiSDT5qhpw
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 28, 2022