కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా జూలై 14 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విజిల్ అనే మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ ” థియేటర్ ను లాస్ట్ టైం కూడా 50% ఆక్యుపెన్సీలో చూశాను.. ఈ సాంగ్ లాంచ్ లో 100% ఆక్యుపెన్సీ చూస్తున్నాను. మీ అందరిని చూస్తుంటే కరోనా తరువాత ఇప్పుడే లాక్ డౌన్ తీసేసినట్లు ఉంది. విజిల వేసే బాధ్యత మీది .. దాన్ని ఎండ్ చేయాల్సిన బాధ్యత నాది.. ముందుగా ఈ సాంగ్ ను డిజిటల్ రిలీజ్ చేసిన సూర్యగారికి చాలా థాంక్స్. ఆయనే ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఆయన విదేశాల్లో ఉండడం వలన కుదరలేదు. ముందుగా డీఎస్పీ గురించి మాట్లాడాలి.. ఇటీవల రిలీజ్ అయినా బుల్లెట్ సాంగ్ రన్ అవుతూనే ఉంది . అసలు ఎక్కడా ఆగడం లేదు.. తెలుగు, తమిళ్ లోనే కాకుండా సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తోంది. దేవి నా మీద ప్రేమనంత నా ఆల్బమ్స్ లో చూపిస్తాడు.
నా కెరీర్ అంతా తను ఇచ్చిన బ్లాక్ బస్టార్సే ఉన్నాయి. మరో మంచి ఆల్బమ్ ఇచ్చినదుకు థాంక్స్ దేవి.. ఈ సినిమా టైటిల్ ఎందుకు పెట్టామో ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు తెల్సింది. చాలా ప్రాబ్లెమ్స్ వచ్చినా సరే ఈ సాంగ్ ను ఫినిష్ చేశాం.. సాంగ్ షూటింగ్ సమయంలో రంజాన్ కారణంగా జానీ మాస్టర్ ఉపవాసం.. అయినా కూడా ఆయన ఎంతో ఓపిగ్గా స్టెప్స్ నేర్పించారు. ఇక కృతి డేట్స్ కొంచెం ఇబ్బంది అయినా అడ్జెస్ట్ చేసుకొని సినిమా చేసింది.. థాంక్స్ కృతి. ఇక ఈ సినిమాలోని సాంగ్ చూసి మీరు విజిల్ వేస్తున్నారంటే ప్రతి ఒక్కరి టీం వర్క్ అది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. ఇక సాంగ్ గురించి చెప్పాలంటే ఇది టిక్ టాక్ చేసే సాంగ్ కాదు.. థియేటర్ సాంగ్.. సినిమాకొచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి.. ఫ్యాన్స్.. మీ కోసం ఏ సినిమాలో చాలా పెట్టించాను.. ఈ సాంగ్ కూడా మీకోసమే అడిగి మరీ పెట్టించాను.. అందరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి” అని చెప్పుకొచ్చాడు.