బోయపాటి, రామ్ చేసిన స్కంద సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో మూడు రోజుల్లో స్కంద థియేటర్లోకి రానుంది. బోయపాటి మార్క్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్‌తో స్కంద రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు రామ్. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. గంతలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తామని అనుకొని.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి నందమూరి బాలకృష్ణ కూడా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది కానీ అనుకోకుండా సలార్ పోస్ట్‌పోన్ అవడంతో… స్కందను సెప్టెంబర్ 28కి తీసుకొస్తన్నారు. ఈ క్రమంలో కరీంనగర్ గడ్డపై కల్ట్ జాతర పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
Read Also: Pooja Hegde: పూజకు గురూజీ నుంచి పిలుపు… పాన్ ఇండియా ఛాన్స్?
సాయంత్రం 6 గంటల నుంచి వీ కన్వెన్షన్ హాల్‌లో ‘కల్ట్ జాతర’ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ కానుంది. అఖండ వంటి హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో… ఖచ్చితంగా ఈ సినిమా రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. సాయి మంజ్రేకర్ మరో కీలక పాత్రలో నటించింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. రామ్, బోయపాటి చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి… స్కంద థియేటర్లో పాన్ ఇండియా మాస్ జాతర చేయిస్తుందని అంటున్నారు. మరి స్కంద ఎలా ఉంటుందో చూడాలి.