Pooja Hegde: పూజకు గురూజీ నుంచి పిలుపు… పాన్ ఇండియా ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి సినిమాలో పూజాకు ఛాన్స్ ఉండదని ఫిక్స్ అయిపోయారు. అలా అనుకున్న వారికి షాక్ ఇస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ఆఫర్‌ను పూజా ముందు పెట్టాడట త్రివిక్రమ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కానీ ఇంకా త్రివిక్రమ్ ఆ వైపు అడుగులు వేయలేదు. గుంటూరు కారం రీజనల్ లెవల్లోనే తెరకెక్కుతోంది.
నెక్స్ట్ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అందుకే.. అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఇటు గుంటూరు కారం, అటు పుష్ప2 అయిపోగానే బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఈసారి పాన్ ఇండియాను టార్గెట్ చేశారు బన్నీ, త్రివిక్రమ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. గుంటూరు కారంలో ఛాన్స్ మిస్ అయినందుకే.., పూజకు త్రివిక్రమ్ ఈ పాన్ ఇండియా ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే… ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేని పూజకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!