Ram : భారీ రెమ్యూనరేషన్ కు డిమాండ్… రిస్క్ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రామ్ మరో సినిమాకు సిద్ధం అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ అప్పుడే సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం రామ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.
Read Also : RadheShyam: వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ తో సిద్దమైన ప్రేమ జంట
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
“అఖండ”తో భారీ హిట్ కొట్టిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను రెమ్యూనరేషన్ పెరిగినట్టు తెలుస్తోంది. ఆ సినిమా విజయంతో బోయపాటికి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడడం లేదు. ఇక బోయపాటి నెక్స్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో చేయాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం గీతా ఆర్ట్స్ కోసం అల్లు అర్జున్ సినిమాను ప్రారంభించాలనుకున్నాడు. అయితే అల్లు అర్జున్ మరో ఎనిమిది, పది నెలల పాటు “పుష్ప 2” షూటింగ్‌లో బిజీగా ఉండనున్నాడు. కాబట్టి బోయపాటి శ్రీను వేరే స్టార్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రామ్ పోతినేనితో సినిమా ప్రారంభించడానికి చర్చలు జరిగాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ తెరపైకి రావాలంటే బడ్జెట్ భారీగానే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ పోతినేని 15 కోట్లు డిమాండ్ చేసినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు రామ్‌కి ఇంత భారీ పారితోషికం ఇవ్వడానికి అంగీకరిస్తే, హీరో దర్శకుడు ఇద్దరికీ కలిపి ఏకంగా రూ.30 కోట్లు అవుతుంది. ప్రొడక్షన్, ఇతర రెమ్యూనరేషన్ల కోసం నిర్మాత మరో 40 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ దాదాపు 100 కోట్లు అవుతుంది. కానీ ఇప్పటి వరకు రామ్ సినిమాలు 40 నుంచి 50 కోట్లలోపే రాబడుతున్నాయి. మరి ఈ కాంబినేషన్ రావాలంటే నిర్మాతలు రిస్క్ తీసుకోవాల్సిందే.
తాజావార్తలు
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్‌వేర్’ గుర్తింపు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..