RAM Movie team announces 5 Rupees on ticket to Defence Fund: దేశ భక్తిని చాటే మూవీగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానుండగా ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు పెంచేయగా మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ‘మంచి కంటెంట్‌తో రామ్ చిత్రం రాబోతోంది అని, ఎన్నో ఆర్థిక కష్టాలు పడి ఈ సినిమాను నిర్మించారు.
Salaar : ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రభాస్ సలార్ మూవీ..
నేను కొంత రషెస్ చూశా, సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమానే అయినా సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ఇదే ఈవెంట్ లో నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ.. ‘మాకు ఇది మొదటి సినిమా, సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదన్నారు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు ఇక ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు కానీ ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్‌లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తామని, అంతేకాక మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని అన్నారు.