పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది.జనవరి 20 న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ లో రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ మూవీ ఓటీటీ లో కూడా దుమ్మురేపుతుంది.ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఐదు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి పదకొండు మిలియన్ల వరకు వ్యూస్ వచ్చినట్లు ఓటీటీ వర్గాలు చెబుతోన్నాయి.తక్కువ టైమ్‌లోనే హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు సమాచారం… సలార్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సలార్ మూవీ ఓటీటీలో రిలీజైన కూడా థియేటర్లలో సలార్ మూవీ కలెక్షన్స్ తగ్గలేదు. 32వ రోజు సలార్ మూవీకి 59 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 723.50 కోట్ల వసూళ్లను సలార్ రాబట్టింది. ఫస్ట్ డేనే 176 కోట్ల కలెక్షన్స్‌తో సలార్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
ప్రభాస్ కెరీర్‌తో పాటు 2023లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో సలార్ మూవీ ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 750 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అయితే సలార్ మూవీ కన్నడ లో ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఉగ్రమ్ స్ఫూర్తితో తెరకెక్కింది. ఇద్దరు స్నేహితుల కథతో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు. ఖాన్సార్ అనే ప్రాంతానికి తన స్నేహితుడు వరదరాజమన్నార్‌ను దొరను చేయడానికి దేవా ఎలాంటి పోరాటం సాగించాడు..దేవాను చూసి గ్యాంగ్‌స్టర్స్ అందరూ భయపడటానికి కారణం ఏమిటి..దేవా, వరదరాజ మన్నార్ మధ్య స్నేహం ఎలా మొదలైంది అన్నదే సలార్ మూవీ కథ.సలార్ మూవీకి శౌర్యంగపర్వం పేరుతో సీక్వెల్ కూడా రాబోతోంది. త్వరలోనే ఈ సీక్వెల్ గురించి మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ తెలియజేయనుంది.