Ram Gopal Varma: తగ్గేదేలే.. గరికిపాటిని గడ్డిపరకతో పోల్చిన ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma Sensational Tweets On Garikipati Narasimha Rao: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విజృంభించాడు. ఈసారి ఆయన గరికిపాటి నరసింహా రావుని టార్గెట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానించిన వాడు గడ్డిపరకతో సమానమని, చిరంజీవి జోలికొస్తే మెగాభిమానిగా తాను కూడా వెనక్కు తగ్గేదే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. తొలుత నాగబాబు చేసిన ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ.. ‘‘ఐ యాం సారీ నాగబాబు, మెగాస్టార్‌ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు, మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలే’’ అని సంచలన ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతేకాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు, మెగాస్టార్ చిరంజీవి ఏనుగు, నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’’ అంటూ మరో ట్వీట్‌లో వర్మ చెలరేగిపోయాడు.
ఆ తర్వాత ‘‘హే గూగురుపాటి నరసింహ రావు, తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి’’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అనంతరం.. ‘‘నాగబాబు సర్, మీ అన్నయ్యని ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రికని మంటలలో మండించకపోతే, ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు’’ అని ఇంకో ట్వీట్ చేశాడు. ఈ విధంగా రెచ్చిపోయి వర్మ చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు.. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే, ఆ పాటి అసూయ పడటం పరిపాటే’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌కి చేతులెత్తి నమస్కరించే ఎమోజీతో పాటు పగలబడి నవ్వే ఎమోజీలతో రీట్వీట్ చేశాడు.
Also Read
- JoJo : 'జోజో' ఫస్ట్ లుక్.. 'మనోభావాల బ్యాచ్'కి స్వీట్ వార్నింగ్
- #PrabhasDP : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
- Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
కాగా.. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో గరికిపాటి నరసింహ రావు, చిరంజీవి మధ్య చోటు చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే! అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతుండగా.. ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని గరికిపాటి అన్నారు. దీనిపై అప్పుడు పెద్ద దుమారమే రేగింది. నాగబాబు సహా మెగాభిమానులందరూ గరికిపాటిని టార్గెట్ చేసి, నెట్టింట్లో విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వివాదం ఇప్పుడు చల్లారిందనుకుంటున్న తరుణంలో.. రాంగోపాల్ వర్మ తన ట్వీట్లతో మళ్లీ దానికి ఆజ్యం పోశాడు.
🙏🙏🙏😂😂😂💐💐💐💪💪💪 https://t.co/Hoo7uA6eCB
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
ఐ యాం సారీ @NagaBabuOffi గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో @KChiruTweets ని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె…* 😡😡😡💪💪💪 https://t.co/hyJ8ORvA6N
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
https://twitter.com/RGVzoomin/status/1579502043399852034?s=20&t=VH8lpC3fYffiU7ITRtifoQ
తాజావార్తలు
-
Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్‌కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!