Ram Gopal Varma: ఏంటి.. ఇది నిజమా.. ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్ సినిమాలో కనిపిస్తున్నాడా.. ? అసలు ఈ ఊహనే మైండ్ లోకి రాలేదు.. ? ఎలారా ఈ పుకారు వచ్చింది అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ, ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు కానీ, ఈ పుకారు సోషల్ మీడియా మొత్తం షికారు చేస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Sathyaraj: ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ గా కట్టప్ప.. ఆయన అందరికీ గర్వకారణం
ఇక ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కల్కి సినిమాలో ఒక క్యామియోలో నటిస్తున్నాడట. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి, వర్మ మధ్య జరిగే సీన్ ఉందని టాక్ నడుస్తోంది. ఎప్పటినుంచో రాజమౌళి ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక జక్కన్న తోనే వర్మ సీన్ పెట్టాలని నాగి ప్లాన్ చేసాడని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. కానీ, ఇదే కనుక నిజమైతే..వర్మ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అస్సలు ఇప్పటివరకు ఏ సినిమాలో క్యామియోలో కనిపించని వర్మ మొదటిసారి ప్రభాస్ సినిమాలో కనిపించడం అంటే మాములువిషయం కాదు అని అంటున్నారు. వర్మ న్యూస్ తో కల్కిపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.