Sathyaraj: కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. హిందూ సనాతన ధర్మాన్ని నిర్ములించాలంటూ సంచలనం వ్యాఖ్యలు చేయగా.. అవికాస్తా వైరల్ కావడంతో హిందూ సంఘాలు అతడిపై మండిపడుతున్నాయి. తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్.. “డెంగ్యూ, మలేరియా ఎలాగో సనాతన ధర్మం కూడా అంతే.. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు.. దాన్ని నిర్మూలించాలి” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీంతో కేవలం తమిళనాడులోనే కాకుండా దేశం మొత్తంలోని హిందూ సంఘాలు ఉదయనిధిపై విరుచుకుపడుతున్నాయి. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని కించపరిచే విధంగా.. తక్కువ చేసే విధంగా మాట్లాడితే సహించబోమని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కూడా తమదైన శైలిలో మాటల దాడులు చేస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ చేసేవారు కూడా ఎక్కువ అయ్యారు.
Mammootty: దేవుడా.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన మెగాస్టార్.. ?
తాజాగా నటుడు సత్యరాజ్.. ఉదయనిధికి సపోర్ట్ గా నిలిచాడు. తన మద్దతు ఉదయనిధికే అని, ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించాడు. తాజాగా మీడియా ముందు సత్యరాజ్ మాట్లాడుతూ.. ” సనాతనం గురించి మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టంగా మాట్లాడారు.. ఉదయనిధి స్టాలిన్ ధైర్యాన్ని అభినందిస్తున్నాను.. మంత్రి ప్రతి విషయంలోనూ వ్యవహరిస్తున్న, అనుచరిస్తున్న తీరు గర్వకారణం” అనిచెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సత్యరాజ్ పై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక సత్యరాజ్.. బాహుబలి కట్టప్ప పాత్రతో తెలుగువారికి కూడా సుపరిచితమే. ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నాడు. మరి ఇప్పుడు సత్యరాజ్ పై హిందూ సంఘాలు ఎలా విరుచుకుపడతాయో చూడాలి.