‘పెద్ది’ మోతకు రంగం సిద్ధమైంది. రీసెంట్గా స్టూడియోలో ఏఆ రెహమన్‌తో కలిసి రామ్ చరణ్, బుచ్చిబాబు షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ‘పెద్ది’ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ లోటుని ఈ సినిమా తీరుస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు అభిమానులు. బుచ్చిబాబు వదులుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెంచుతునే ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో రీ సౌండ్ వచ్చింది. ముఖ్యంగా చరణ్ మాసివ్ లుక్ మాత్రం అదిరిపోయింది. దీంతో.. ఈసారి రంగస్థలంలోని చిట్టిబాబుకి మించిన రామ్ చరణ్‌ను చూడబోతున్నామని అంతా ఫిక్స్ అయ్యారు.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఉంటే ఆయనే ఉండాలని పట్టుబట్టి మరీ.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించాడు బుచ్చి. అందుకు తగ్గట్టే.. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట రెహమాన్. త్వరలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. లేటెస్ట్గా.. ఈ పాటను ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఉంటే సెప్టెంబర్ 28న ఉండొచ్చని అంటున్నారు. ఆరోజు హీరోగా రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి 18 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా.. పెద్ది ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇదే నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కు ఈసారి దసరా పండగ పెద్ది సౌండ్‌తో దద్దరిల్లిపోనుంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. 2026 మార్చి 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మరి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న పెద్ది.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.