Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా సినిమా షూట్ జరుపుకుంటోంది. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ షాట్ భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం ఓ యంగ్ బ్యూటీని అడిగారంట. ఆమె ఎవరో కాదు మలయాళ నటి స్వాసిక. ఆమె తెలుగులో మంచి పాపులర్. నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో చుట్ట కాలుస్తూ విలన్ రోల్ లో నటించి అదరగొట్టింది. తాజాగా ఈ విషయాన్ని స్వాసిక బయట పెట్టింది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ తల్లి క్యారెక్టర్ కోసం నన్ను అడిగితే వద్దని చెప్పాను.
Read Also : OG : వీరమల్లు ఎఫెక్ట్.. ఓజీకి భారీ ప్లాన్..
నిజంగా ఆ ఆఫర్ విని నాకు షాకింగ్ గా అనిపించింది. కానీ రామ్ చరణ్ కు నేను తల్లిపాత్ర చేయకపోవడం బెటర్ అనుకున్నాను. అందుకే వద్దని చెప్పేశాను. ఒకవేళ భవిష్యత్ లో రామ్ చరణ్ కు తల్లి పాత్ర చేయాల్సి వస్తే అప్పుడు ఆలోచిస్తానని తెలిపింది స్వాసిక. ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అసలు రామ్ చరణ్ కు ఆమె తల్లి పాత్ర చేయడం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు, స్వాసిక వయసు 33 ఏళ్లు. యంగ్ బ్యూటీని రామ్ చరణ్ కు తల్లిపాత్రలో చూపిస్తే సింక్ పోతుంది కదా. బుచ్చిబాబు ఈ మాత్రం ఆలోచించకుండానే ఆఫర్ చేశారా అంటున్నారు చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే వయసు తేడా ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు ఆమె ఎంత గొప్పగా నటించినా.. పాత్రలో ఉండే సోల్ పోతుంది. రామ్ చరణ్ కు తల్లి పాత్ర చేయాలంటే అతనికంటే పెద్ద వయసు వారైతేనే బాగా సూట్ అవుతారని అంటున్నారు. ప్రస్తుతం ఆమనిని తల్లి పాత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : Deepika Padukone : సీక్రెట్ గా వీడియో తీసిన వ్యక్తి.. ఫైర్ అయిన దీపిక పదుకొణె