Anchor Pradeep: బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏ టీవీ ఛానెల్ పెట్టినా ప్రదీపే ప్రత్యక్షమవుతాడు. ఇక 30 దాటినా ఈ గురుడు పెళ్లి ఊసు ఎత్తడం లేదు.కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రదీప్ పెళ్లి అంటూ నిత్యం ఎవరో ఒకరితో పెళ్లి చేసేస్తున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది ప్రదీప్ పెళ్ళికి సిద్ధమవుతున్నాడట. తనకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న నవ్య అనే యువతిని ప్రదీప్ పెళ్లాడనున్నాడట.
గత కొంత కాలంగా ప్రదీప్ ఒక ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆమె సినీ సెలబ్రిటీలకు డిజైనర్ గా కొనసాగుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో కొంతమంది కంటెస్టెంట్స్ కు ఆమె డిజైనర్ గా వర్క్ కూడా చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని, ఇరు కుటుంబాలు అంగీకారంతో వచ్చే ఏడాది ప్రదీప్ పెళ్లి కొడుకుగా మారనున్నట్లు తెలుస్తోంది. దీంతో హమ్మయ్య వచ్చే ఏడాది అయినా ప్రదీప్ ఒక ఇంటివాడు కాబోతున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఆ ఫ్యాషన్ డిజైనర్ ఎవరా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.