Ram Charan to Release Bhola Shankar Trailer on 27th July: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూపొందుతున్న కొత్త సినిమా భోళా శంకర్. తమిళంలో వేదాళం సినిమాను తెలుగులో భోళా శంకర్ పేరుతొ తెరకెక్కించారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Pawan Kalyan: పవన్ కౌంటర్… రోజా భర్తకేనా?
తాజాగా మెగా అభిమానులకు మాంచి కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చింది సినిమా యూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జూలై 27న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా భోళా శంకర్ ట్రైలర్ లాంచ్ కానుందని వెల్లడించారు. ఇక నిజానికి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ కి వరుసగా పండుగ చేసుకునే అవకాశం దొరికినట్టు అయింది.

Chiranjeevi Ram Charan Bhola Shanakar Trailer