ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన మొదట్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఎప్పుడైతే ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కిందో అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ అయింది. అంతేకాదు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమానే ముందుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోను ఇండియన్ 2 తర్వాతే గేమ్ చేంజర్ థియేటర్లోకి రానుందని అన్నారు పైగా దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ అప్డేట్స్ శంకర్‌కే తెలుసని చెప్పుకొచ్చాడు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండాపోయింది.
2024 సంక్రాంతికి ఇండియన్ 2 రిలీజ్ అయితే… సమ్మర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఇండియన్ 2 రిలీజ్ కంటే ముందే గేమ్ చేంజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే… వచ్చే ఏడాది ఫస్ట్ హాప్‌లోనే గేమ్ చేంజర్ రిలీజ్ పక్కా అని చెప్పొచ్చు. ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. ఇప్పటికే శంకర్ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ సెట్ చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. శంకర్ మార్క్ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.