Ram Charan: నా కెరీర్‌లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం

Ram Charan Peddi

Ram Charan Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశరొక్కున నిలిపింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

భోపాల్ ప్రజల ఆత్మీయతకు ముగ్ధుడైన రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నా మనసులో మధ్యప్రదేశ్ ప్రజలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ‘పెద్ది’ ప్రమోషన్స్ ఇక్కడి నుంచే ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. నా కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ.. నా ఫిల్మ్ లైబ్రరీ మొత్తంలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది అని చాలా గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమా కోసం మేమంతా ఎంతలా కష్టపడ్డామో, ఎంత ప్రేమతో పనిచేశామో ఆ ప్రతి ఒక్క ఎమోషన్ ప్రేక్షకుల హృదయాలకు నేరుగా చేరుతుందనే నమ్మకం నాకుంది” అని స్టేజ్‌పై సంచలన ప్రకటన చేశారు.

ఈ సినిమా కథాంశంపై చరణ్ మరింత క్లారిటీ ఇస్తూ “‘పెద్ది’ అనేది కేవలం ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ మాత్రమే కాదు. సమాజంలో తన ఉనికి కోసం, తన గుర్తింపు కోసం ఒక వ్యక్తి చేసిన సుదీర్ఘమైన పోరాటం. ఆ ఎమోషనల్ జర్నీ మీ హృదయాలను తాకుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా మళ్లీ మళ్లీ చూడాలనే సరికొత్త అనుభూతిని ఈ చిత్రం కలిగిస్తుంది” అని తెలిపారు. గతంలో మీరంతా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి ఎలాంటి భారీ ప్రేమను అందించారో.. అదే ప్రేమను ‘పెద్ది’కి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయ్యాక మా ‘పెద్ది సక్సెస్ టూర్’ కూడా ఇదే భోపాల్ నగరంలో గ్రాండ్‌గా జరుపుకుంటాం” అని రామ్ చరణ్ తన స్పీచ్‌ను ముగించారు.