Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశరొక్కున నిలిపింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
భోపాల్ ప్రజల ఆత్మీయతకు ముగ్ధుడైన రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నా మనసులో మధ్యప్రదేశ్ ప్రజలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ‘పెద్ది’ ప్రమోషన్స్ ఇక్కడి నుంచే ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. నా కెరీర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ.. నా ఫిల్మ్ లైబ్రరీ మొత్తంలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది అని చాలా గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమా కోసం మేమంతా ఎంతలా కష్టపడ్డామో, ఎంత ప్రేమతో పనిచేశామో ఆ ప్రతి ఒక్క ఎమోషన్ ప్రేక్షకుల హృదయాలకు నేరుగా చేరుతుందనే నమ్మకం నాకుంది” అని స్టేజ్‌పై సంచలన ప్రకటన చేశారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ సినిమా కథాంశంపై చరణ్ మరింత క్లారిటీ ఇస్తూ “‘పెద్ది’ అనేది కేవలం ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ మాత్రమే కాదు. సమాజంలో తన ఉనికి కోసం, తన గుర్తింపు కోసం ఒక వ్యక్తి చేసిన సుదీర్ఘమైన పోరాటం. ఆ ఎమోషనల్ జర్నీ మీ హృదయాలను తాకుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా మళ్లీ మళ్లీ చూడాలనే సరికొత్త అనుభూతిని ఈ చిత్రం కలిగిస్తుంది” అని తెలిపారు. గతంలో మీరంతా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి ఎలాంటి భారీ ప్రేమను అందించారో.. అదే ప్రేమను ‘పెద్ది’కి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయ్యాక మా ‘పెద్ది సక్సెస్ టూర్’ కూడా ఇదే భోపాల్ నగరంలో గ్రాండ్‌గా జరుపుకుంటాం” అని రామ్ చరణ్ తన స్పీచ్‌ను ముగించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?