అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జవాన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి…