మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో చేస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే మెగా ఫాన్స్ అండ్ అక్కినేని ఫాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. సోషల్ మీడియాలో ట్వీట్స్ తో రామ్ చరణ్ అండ్ అఖిల్ మ్యూచువల్ ఫాన్స్ హల్చల్ చేశారు. రిలీజ్ కి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది ఇంకెప్పుడు ఆ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుందా ని ఫాన్స్ వెయిట్ చేస్తూ ఉంటే… అందరికీ షాక్ ఇస్తూ వన్ మినిట్ వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్, ధృవ సినిమాలోని తన రోల్ ని రీప్రైజ్ చెయ్యగా… అఖిల్ ఏజెంట్ లా కనిపించాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరి మధ్య మంచి డైలాగ్స్ తో వీడియోని డిజైన్ చేశారు. ఎక్కడున్నావ్ ఏజెంట్ అని చరణ్ అడగడం, దగ్గరలోనే ఉన్నా ధృవా అని అఖిల్ చెప్పడంతో మొదలైన ఈ వీడియో… వైల్డ్ సాలా వచ్చేయ్ అని చరణ్ అనే వరకూ సాగింది. నీ కమాండ్ కోసమే వెయిట్ చేస్తున్నా అంటూ అఖిల్ ఈ ప్రమోషనల్ వీడియోకి ఎండ్ కార్డ్ వేశాడు.
ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఏజెంట్ సినిమా బిగ్ టికెట్ ని చరణ్ తో లాంచ్ చేయించడానికి మేకర్స్ ఈ వీడియోని వాడారు. చరణ్ తో దృవ సినిమాని చేసిన సురేందర్ రెడ్డి, ఏజెంట్ మూవీకి కూడా దర్శకుడు అవ్వడం… చరణ్ అండ్ అఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఈ ప్రమోషనల్ వీడియో బయటకి వచ్చింది. నిజానికి ఈ వీడియో స్వీట్ సర్పైజ్ అయినా ఫాన్స్ మాత్రం ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేశారు. చరణ్ కి అఖిల్ కి మధ్య ఇంటర్వ్యూలా ఉంటుందనో, ఇద్దరూ కలిసి కనిపిస్తారనో, లేక హైదరాబాద్ లో ఏదైనా ఈవెంట్ పెట్టి చరణ్ ని గెస్టుగా పిలుస్తారనో ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
#DHRUVA gave his command to Launch the BIG TICKET in WILD SAALA style 🤩🎫#DhruvaxAGENT🔥
Mega Powerstar @AlwaysRamCharan x #AGENT @AkhilAkkineni8🤟🏻#AgentWildRideBeginsBook your tickets now!
– https://t.co/Nx1rluTB8qRELEASING TOMORROW❤️🔥@DirSurender @AnilSunkara1… pic.twitter.com/xml6959G8n
— AK Entertainments (@AKentsOfficial) April 27, 2023