Ram Charan: ఓకే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటే.. వంద రెట్లు ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక అదే సినిమాలో మరో స్టార్ హీరో క్యామియో చేస్తున్నాడు అంటే.. హైప్ ఆకాశానికి వెళ్తోంది. దానివలన.. సినిమాకు పాజిటివ్ బజ్ వస్తుంది. అందుకే ఈ మధ్య.. సినిమాలో స్టార్ హీరోల క్యామియోలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కనిపించడం అయితే ఓకే కానీ, క్యామియోలు లేకపోయినా.. సినిమా బజ్ కోసం హీరోలను వాడేస్తున్నారు. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ క్యామియో ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. అంతేనా ట్రైలర్ లో ఒక షాట్ లో విజయ్ ఉన్నాడని కూడా చూపించారు. దీంతో సినిమాపై కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. తీరా సినిమాలో చూస్తే మాత్రం విజయ్ క్యామియో లేదు ఏమి లేదు. హైప్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది. ఇప్పుడు లియో సినిమాకు కూడా అదే ప్రమోషన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్
విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. అక్టోబర్ 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈ ఏడాది విజయ్ నటించిన వారసుడు ప్లాప్ టాక్ అందుకుంది. అందుకే.. ఈ సినిమా కు బజ్ పెంచాలని కోలీవుడ్ కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేజీలు.. రామ్ చరణ్ పేరును వాడుతున్నారని చెప్పుకొస్తున్నారు.ట్రైలర్ లో తెలంగాణ నెంబర్ ప్లేట్ తో కారు ఉందని, అది ఖచ్చితంగా చరణ్ దే అని పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని, రామ్ చరణ్ ఎలాంటి క్యామియో లో నటించడం లేదని తెలుస్తోంది. కేవలం బజ్ పెంచడానికే ఇలా చరణ్ పేరును వాడుతున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.