వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా డేటాబేస్ అయిన ‘IMDb’ 2022 పాపులర్ ఇండియాన్ స్టార్ ర్యాంకింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 స్టార్ల పేర్లని రిలీజ్ చేసింది. IMDbకి 200 మిలియన్లకి పైగా ఉన్న మంత్లీ విజిటర్స్, ఏ సెలబ్రిటీకి సంబంధించిన అఫీషియల్ పేజ్ ని ఎక్కువసార్లు విజిట్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకోని ఈ పాపులర్ ఇండియన్ స్టార్ ర్యాంకింగ్ కి రూపొందించారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 4వ స్థానంలో ఉండగా… సమంతా 5వ స్థానంలో, ఎన్టీఆర్ 8వ స్థానంలో, అల్లు అర్జున్ 9వ స్థానంలో ఉన్నారు. ఓవరాల్ గా ఈ ర్యాంకింగ్స్ లో కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అలియా భట్, ఐశ్వర్య రాయ్ రెండు మూడు స్థానాల్లో ఉండగా హృతిక్ రోషన్, కియారా అద్వానీలు ఆరు ఏడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో రాకింగ్ స్టార్ యష్ ఉన్నాడు.
ధనుష్ 2022లో నాలుగు సినిమాలు చేశాడు ఇందులో ఒకటి హాలీవుడ్ లో చేసిన ‘గ్రే మాన్’. ‘తిరుచ్చిత్రాంబలం’ వంద కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేసింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎక్కువగా సెర్చ్ లిస్టులో ఉండడంతో ధనుష్ ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కారణంగా చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ లు టాప్ 10లో చోటు సంపాదించారు. పాన్ ఇండియా హిట్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు పాన్ వరల్డ్ పేరు తెచ్చుకుంటుంది కాబట్టి ఈ మూవీలో నటించిన వాళ్ల కోసం నెటిజనులు సెర్చ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. యష్, అల్లు అర్జున్ లు టాప్ 10 ర్యాంకింగ్స్ లోకి రావడానికి కారణం కూడా ఇదే. ఈ ఇద్దరూ నటించిన ‘KGF 2’, ‘పుష్ప ది రైజ్’ సినిమాలు నార్త్ లో సూపర్ హిట్ అయ్యాయి.
Aaaand we have arrived at the moment we’ve all been waiting for 🥁 Presenting the IMDb Top 10 Most Popular Indian Stars of the year 💛
Who was your favourite Indian star this year? 🎬⭐️ #IMDbBestof2022 pic.twitter.com/w6deLsCZ9y
— IMDb India (@IMDb_in) December 7, 2022