Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. ఇక తండ్రి మరణంతో దిల్ రాజు కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు.. దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయన్ను ఓదారుస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా కూడా దిల్ రాజు కు సానుభూతిని తెలుపుతున్నారు. ఇక తాజాగా దిల్ రాజు ఇంటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లి.. ఆయనను ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. చిరంజీవి అనారోగ్య సమస్యలవలన రాలేకపోయినట్లు తెలుస్తోంది.
Bubblegum Teaser: సుమ కొడుకు మాములుగా లేడుగా.. మొదటి సినిమాలోనే లిప్ లాక్ లు, బూతులు..
ఇక రామ్ చరణ్- దిల్ రాజు కాంబోలో గతంలో ఎవడు సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను దిల్ రాజునే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. శంకర్ ఇండియన్ 2 సినిమా ను ఫినిష్ చేసే పనిలో ఉండగా.. గేమ్ ఛేంజర్ కు గ్యాప్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి ఆయనను దుఃఖంలోకి నెట్టేసింది. ప్రముఖులతో పాటు అభిమానులు కూడా దిల్ రాజు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నారు.