కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అది కూడా రాజమౌళి తర్వాత శంకర్‌తో సినిమా చేస్తున్న ఘనత కేవలం రామ్ చరణ్‌కే చెల్లింది. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘RC 15’కి గేమ్ చేంజర్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్‌ను ఒక పాత్రలో ముఖ్యమంత్రిగా ఇంకో పాత్రలో ఎలక్షన్ ఆఫీసర్ గా చూపించనున్నాడు శంకర్. ఇటీవలే ఇండియన్ 2 షెడ్యూల్ కంప్లీట్ చేసిన శంకర్, గేమ్ చేంజర్ ని కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు. రీసెంట్‌గా క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కర్ణాటక స్టేట్ లోని మైసూర్ లో ప్లాన్ చేసారు. జూన్ 4 నుంచి గేమ్ చేంజర్ షూటింగ్ 8 ఎనిమిది రోజుల పాటు మైసూర్ లో జరగనుంది.
Read Also: Prabhas: రెబల్ స్టార్ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా?
మేజర్ స్టార్ కాస్ట్ అంతా పాల్గొననున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాకా తమిళనాడులో కూడా ఒక షెడ్యూల్ ని శంకర్ ప్లాన్ చేసాడట. అంజలి, శ్రీకాంత్, రాజీవ్ కనకాల ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. గేమ్ చేంజర్ ఈ ఏడాదిలోనే థియేటర్లోకి రావాల్సి ఉండగా, షూటింగ్ డిలే అవ్వడంతో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.