Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తరువాత మంచి అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు పట్టేసి స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగింది. ఇక మొదట్లో ఎంతో ముద్దుగా .. బుగ్గలతో ఉండే ఈ భామ ప్రస్తుతం చిక్కిపోయిన హీరోయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. అంతలా బక్కచిక్కి జీరో సైజు మెయింటైన్ చేస్తోంది. ఇక ఈ ఫిగర్ తో బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ అడపాదడపా హిట్లు అందుకొంటుంది. ఇక రకుల్ కు జిమ్ బిజినెస్ ఉందన్న విషయం తెల్సిందే. తన జిమ్ లో తానే కష్టపడకపోతే.. మిగతావారు ఎలా వస్తారు అనుకున్నదో ఏమో కానీ, సాయం చిక్కినప్పుడల్లా వర్క్ అవుట్స్ చేస్తూనే కన్పిస్తూ ఉంటుంది.
Saindhav: వెంకీ మామ… బాంబ్ పేల్చడానికి రెడీ అయ్యాడు
తాజాగా రకుల్.. తన హార్డ్ వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అమ్మడు ఫిట్ నెస్ చాలెంజ్ లో భాగంగా.. ఫుల్ బాడీ వర్క్ అవుట్స్ చేస్తోంది. ప్లాంక్ వేసి.. గ్యాప్ లేకుండా అన్ని రకాల వర్క్ అవుట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ షేక్ చేసింది. ఇక అందులోను టైట్ జిమ్ డ్రెస్ కావడంతో అమ్మడు మరింత హాట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే గుర్తుపట్టలేనంతగా మారిపోయావు.. ఇక చాలు అని కొందరు.. అసలే అవకాశాలు రావడం లేదు.. ఇంకా బాడీని తగ్గించి అస్సలు కనిపించకుండా పోకు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.