బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రేమికుల రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెల్సిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో తన తప్పు లేదని, భర్త రితేష్ తనను మోసం చేసినట్లు ఆమె తెలిపింది . బిగ్ బాస్ తరువాత తనకు చాలా విషయాలు తెలిసాయని, అప్పుడు కూడా నేను కలిసి ఉందామనుకున్నా కానీ రితేష్ తనను దూరం పెట్టడంతో విడిపోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రితేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
” బిగ్ బాస్ నుంచి వచ్చాకనే రితేష్ కి అంతకు ముందే వివాహమైందని తెలిసింది. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి నేనే ముద్దు పెడతాను.. తను మాత్రం నాకు దూరంగా ఉంటాడు. మొదట్లో సిగ్గు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నా నుంచి దూరం అవ్వాలనుకుంటున్నాడని.. తనను వదిలి ఉండలేక నేనే అతని కాళ్లు పట్టుకొని బతిమిలాడాను. అయినా కూడా అతడు కనికరించకుండా నన్ను వదిలివెళ్ళిపోయాడు. ఒకవేళ తన తప్పు తెలుసుకొని మళ్లీ వస్తే నేను కాపురం చేస్తాను. అయితే ఈసారి మంచి కారు, ఇల్లు ఉంటేనే ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాఖీ సావంత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.