Raju Srivatsav: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ ఇటీవలే గుండెపోటుకు గురైన విషయం విదితమే. జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీ నొప్పితో కుప్పకూలిన ఆయనను వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మొన్నటివరకు ఆయన కోలుకుంటారు అనే నమ్మకం ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన బ్రతికే అవకాశాలు లేవు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం వరకు ఆయన బ్రెయిన్ స్పందించిందని, ఇప్పుడు అది పనిచేయడం ఆగిపోయిందని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.
బ్రెయిన్ డెడ్ అవ్వడంతో రాజు బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్తున్నారు. ఈ విషయాన్నీ మరో ప్రముఖ నటుడు సునీల్ పాల్ అభిమానులతో తెలిపాడు. “రాజు బ్రెయిన్ పనిచేయడం లేదని వైద్యులు అంటున్నారు. కానీ, మీ ప్రార్థనలు ఆయనను కోలుకునేలా చేస్తాయి. రాజు కోలుకోవాలని ప్రార్దించండి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు రాజు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.