Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. నెలాసం దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రజినీ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. తమన్నా, మోహన్ లాల్, సునీల్, జాకీ ష్రాఫ్ లాంటి పెద్ద పెద్ద నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఆడియో లాంచ్ లో రజినీ స్పీచ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు..ఇవి రెండూ జరగని ఊరు లేదు..మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధమయ్యిందా రాజా.. ” అంటూ చివర్లో రజినీ వేసిన పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలు రజినీ సినిమా పరంగా చేశాడా.. ? లేక రాజకీయ పరంగా చేశాడా.. ? అనేది తెలియదు కానీ.. అభిమానులు మాత్రం డైలాగ్ సూపర్ అంటూ చెప్పుకొస్తున్నారు.
Guntur Kaaram: మహేష్ కబడ్డీ కూత.. థియేటర్ లో మోగాలి మోత
రజినీ చెప్పిన దాంట్లో తప్పు లేదని, సమాజం అలాగే ఉందని చెప్పుకొస్తున్నారు. ఎవరు ఎన్ని అన్నా.. మన పని మనం చేసుకుంటూనే పోవాలి.. అప్పుడే విజయం దక్కుతుందని నెటిజన్స్ అంటున్నారు. ఇంకోపక్క రాజకీయపరంగా కూడా ఈ మాటలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే .. గతంలో రజినీ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. దానికి కౌంటర్ గా రజినీ ఈ వ్యాఖ్యలు చేశారని కొంతమంది అంటుండగా.. ఇంకొందరు.. కాదు ఈ మధ్య పవన్.. తమిళ్ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే రజినీ ఈ విధంగా మాట్లాడారని మరికొందరు అంటున్నారు. అసలు రాజకీయపరమైన కౌంటర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, రజినీ వాస్తవాలు చెప్పారని, జీవిత సత్యం చెప్పారని ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియదు కానీ, ఎవరికి తోచినట్లు వారికి ఆపాదించుకోవడం ఎక్కువ అయ్యిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు.