సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 650 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ కోలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి రోబో 2.0 ఇంకొకటి జైలర్, ఈ రేంజ్ కంబ్యాక్ రజినీకాంత్ నుంచి వస్తుందని ఈ మధ్య కాలంలో ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రజినీకాంత్ ని బాక్సాఫీస్ కింగ్ గా మళ్లీ నిలబెట్టింది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసింది జైలర్ సినిమా. ఈ మూవీ ఈ రేంజ్ హిట్ అవ్వడానికి 50% రీజన్ రజినీకాంత్ అయితే ఇంకో 50% రీజన్ అనిరుధ్. రజినీకాంత్ కనిపిస్తే చాలు హుకుమ్ సాంగ్ నే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా కొట్టి థియేటర్స్ లో స్పీకర్స్ ని బద్దలు కొట్టాడు. జైలర్ ఆడియో ఫంక్షన్ లో కూడా హుకుమ్ సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనిరుధ్… ఈ సాంగ్ తోనే జైలర్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోసాడు. సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ లో, పోస్ట్ ఇంటర్వెల్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ హుకుమ్ సాంగ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంటుంది.
క్లైమాక్స్ లో అయితే హుకుమ్ సాంగ్ కి పూనకాలు రావడం గ్యారెంటీ. ఇలాంటిపాటకి సంబందించి ఫుల్ వీడియో సాంగ్ బయటకి వస్తుంది అంటే యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ అయిపోవాలి కానీ అలా జరగలేదు. అసలు హుకుమ్ ఆడియో సాంగ్ చేసినంత సౌండ్ కూడా వీడియో సాంగ్ చెయ్యట్లేదు. ఫుల్ వీడియో సాంగ్ ని మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేసారు, హుకుమ్ సాంగ్ బయటకి వచ్చింది HD క్వాలిటీతో సాంగ్ చూడాలి అనుకున్న వాళ్లకి ఊహించని షాక్ ఇచ్చారు మేకర్స్. పేరుకి హుకుమ్ సాంగ్ పెట్టి విజువల్స్ మాత్రం ఏది పడితే వాడేశారు. లాస్ట్ కి జుజుబీ సాంగ్ విజువల్స్ ని కూడా హుకుమ్ వీడియో సాంగ్ లో పెట్టేసారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది హుకుమ్ వీడియో సాంగ్ థియేటర్ వెర్షన్ కాబట్టి ఈ సాంగ్ బయటకి వచ్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.