Site icon NTV Telugu

Rajini Kanth : పవన్ కల్యాణ్‌ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్

Rajini Kanth

Rajini Kanth

Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్‌ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. రజినీకాంత్ ట్వీట్ మీద పవన్ కల్యాణ్‌ మళ్లీ స్పందించారు.

Read Also : Nagarjuna : జగపతిబాబును తన సినిమాలో వద్దన్న నాగార్జున.. ఎందుకంటే..?

మై డియర్ బిగ్ బ్రదర్.. మీ మాటలు నా మనసును తాకాయి. మీ ప్రేమ, ఆశీస్సులకు స్పెషల్ థాంక్స్. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ తెలిపారు పవన్ కల్యాణ్‌. ఇలా బిగ్ స్టార్స్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్వీట్లను చూసిన ఇరువురి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. రజినీకాంత్ మొన్ననే కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. రజినీకాంత్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ మూవీ. దీని తర్వాత కూడా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేశాడు రజినీకాంత్.

Read Also : Soumya Rao : అక్కడ చేతులేశాడు.. రాత్రంతా బస్టాండ్ లోనే.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version