RRR: ‘ఆర్.ఆర్.ఆర్’ బడ్జెట్ ఎంత..?అంతనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో వారం రోజులకు జనం ముందు నిలవనుంది రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ఆర్.ఆర్.ఆర్.’ కొన్ని దశాబ్దాల తరువాత తెలుగునాట వస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ను కీర్తిస్తున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఈ నెల 25న సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ బడ్జెట్ ఎంత అన్న దానిపైనా సినీఫ్యాన్స్ లో విశేషంగా చర్చ సాగుతోంది. మూడువందల కోట్లు అని కొందరు, కాదు నాలుగు వందల కోట్లని మరికొందరు, ఐదు వందల కోట్లు దాటిందని ఇంకొందరు ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అయితే ‘ట్రిపుల్ ఆర్’ బడ్జెట్ అక్షరాలా మూడువందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయిందట! ఈ మాట చెప్పిందెవరో కాదు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని. ఈ మొత్తంలో సినిమాలో నటించిన యన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి పారితోషికాలు కలుపలేదట! అదీగాక జియస్టీ లేకుండానే రూ.336 కోట్లట!
ఇటీవల ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.వి.వి. దానయ్య ఏపీ సీఎమ్ జగన్మోహన రెడ్డిని ఈ చిత్రం బడ్జెట్ విషయమై కలిసి, ప్రస్తావించారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించి, ఆ సినిమా బడ్జెట్ ఎంత? దానికి అనుగుణంగా ఆ చిత్రానికి టిక్కెట్ రేటు ఎంత పెంచాలి అన్న అంశాలపై ఆలోచించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి, మంత్రి నానికి తమ సినిమా బడ్జెట్ వివరాలు తెలిపారు రాజమౌళి, దానయ్య. అందువల్ల నానికి అంత పక్కాగా ‘ట్రిపుల్ ఆర్’ నిర్మాణ వ్యయం ఎంతనో తెలిసి పోయింది. దాంతో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న టిక్కెట్ రేట్లకు అదనంగా రూ.100 పెంచుకోవచ్చునని తేల్చింది. బాగానే ఉంది. మరి ఈ సినిమాలో నటించినందుకు తారక్, చెర్రీ, అలియా ఎంత పుచ్చుకున్నారు.
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
దర్శకత్వం వహించినందుకు రాజమౌళి పారితోషికం ఎంత అన్న అంశాలపైనా చర్చ సాగుతోంది. మళ్ళీ ఎవరికి వారు తమకు తోచిన లెక్కలు చెబుతున్నారు. నాని తెలిపారని చెబుతున్న రూ.336 కోట్లకు అదనంగా మరో రెండు వందల కోట్లు కలపాలని కొందరి మాట! మరికొందరు మూడువందలు కలుపుకోక తప్పదని అంటున్నారు. ఇలా లెక్కలు సాగుతున్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలయ్యాక ఎంత వసూలు చేస్తుంది అన్న దానిపైనా ముచ్చట్లు సాగుతున్నాయి. మరి అసలు ఎంత, రాబడి ఎంత అన్న విషయాలు ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలిచాక, ఆపై వసూళ్ళు కురిశాకే తెలుస్తాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!