Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్‌పై 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. గోల్డ్ మెడల్ పోరులో ఓటమిపాలైనప్పటికీ పాక్ క్రికెట్‌కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేజీలు మాత్రం మరో అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాద్ మజూర్ కొట్టిన సిక్సర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నాయి.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇప్పటివరకు నలుగురు పాకిస్థాన్ బ్యాటర్లు సిక్సర్లు బాదారని పేర్కొంటూ పాకిస్థాన్ క్రికెట్ పేజీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాయి. దీనిని ఒక ప్రత్యేక ఘనతగా చూపిస్తూ.. బుమ్రాపై సిక్సర్లు కొట్టిన పాక్ బ్యాటర్ల గురించి అభిమానులతో పంచుకుంటున్నాయి. ఏషియన్ గేమ్స్ ఫైనల్లో ఓటమి ఎదురైనా.. మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెట్టి బుమ్రాపై కొట్టిన సిక్సర్‌ను హైలైట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అరె.. ఏంట్రా ఇది’, ‘గోల్డ్ మెడల్ వదిలేసి..సిక్సర్‌ను హైలెట్ చేయడం ఏంటి?’, ‘మ్యాచ్ గెలవడం కంటే బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడానికే ఇంత క్రేజ్ ఏంటి?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Also Read
- Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
- Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
- IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
- Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో.. అతడి బౌలింగ్‌లో బౌండరీ సాధించడం పాక్ క్రికెట్ పేజీలకు ప్రత్యేక అంశంగా మారినట్లు ఈ పోస్టులు చూపిస్తున్నాయి. అయితే మ్యాచ్ ఫలితం కంటే ఒక్క సిక్సర్‌ను ఎక్కువగా ప్రచారం చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏషియన్ గేమ్స్ ఫైనల్ ఫలితాన్ని పక్కనపెట్టి బుమ్రాపై సిక్సర్ చుట్టూ పాక్ క్రికెట్ పేజీలు చేస్తున్న ప్రచారం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..