ఏషియన్ కాంటినెంట్ కి మాత్రమే పరిమితం అయిన ఇండియన్ సినిమాని కాదు ఎమోషన్స్ ప్రతి మనిషికీ ఒకేలా ఉంటాయి. ఈస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా, వెస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా ఎమోషన్స్ ఒకటే అని నిరూపిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టిన జక్కన, ఇండియాకి ఆస్కార్ తీసుకోని వచ్చే పనిలో ఉన్నాడు. రేస్ టు ఆస్కార్స్ లో భాగంగా పోటి చేసిన ప్రతి అవార్డ్స్ ఈవెంట్ లో జెండా ఎగరేస్తున్న రాజమౌళి అండ్ టీం రీసెంట్ గా ప్రెస్టీజియస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ కి గాను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మొదటి ఏషియన్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్ చరిత్రకెక్కింది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఈవెంట్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సంధర్భంగా “చాలా హ్యాపీగా ఉంది, అందరికి థాంక్స్. కొంచం అన్ హెల్తీగా ఉంది. తరువాత మాట్లాడుకుందాం..” అని రాజమౌళి మాట్లాడాడు. ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకోని రాజమౌళి అండ్ టీం, ఒక ప్రెస్ మీట్ కానీ పార్టీ కానీ జరిపి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి జనవరి 24న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ అనౌన్స్మెంట్ లిస్టులో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంటే అప్పుడు జక్కన అండ్ టీం తిరిగి లాస్ ఏంజిల్స్ వెళ్తారు.