యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదలైంది.
Read Also : నెక్స్ట్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
“రాజా గారు బయటకొస్తే అంటూ సాగిన ఈ పెప్పీ సాంగ్ లో ఉన్న క్రేజీ లిరిక్స్, స్పెషల్ ర్యాప్ ఈ స్పై థ్రిల్లర్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రశాంత్ ఆర్ విహారి కంపోజ్ చేసిన సంగీతం థీమ్ సాంగ్‌కు సూపర్ ఎనర్జిటిక్ మూడ్ ని ఇచ్చింది. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, డేవిడ్ సైమన్ పాడిన ఈ సాంగ్ కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర గురించి తెలుపుతోంది. ఆది రెడ్డి టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. మేకర్స్ త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.