నెక్స్ట్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ విభిన్నతకు ప్రాధాన్యతనిచ్చే యువ నటులలో శర్వానంద్ ఒకరు. ఆయన కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ, విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అయిన “మహా సముద్రంపై” ఈ హీరో ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత శర్వా హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా చేస్తున్నాడు మరియు ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.

Read Also : “ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్

ఓ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నప్పటికీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ చాలామంది చిత్ర నిర్మాతలతో అప్పుడే చర్చలు జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు శర్వానంద్ ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. రాజు సుందరం, శర్వానంద్ గత కొన్ని సంవత్సరాలుగా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చను నేటికి ఓ కొలిక్కి వచ్చాయన్న మాట. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. దసరాకు ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles