బాలీవుడ్‌లో ఏడాదికి మినిమం రెండు మూడు సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవగన్. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టే నిండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఔరో మె కహా ధమ్ థా’ సినిమా వచ్చినట్లు వెళ్లినట్లు కూడా తెలియదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సింగం ఎగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదన్న టాక్ ఉంది. ఆ తర్వాత వచ్చిన ‘నామ్’, ‘ఆజాద్’ నామ్ కే వాస్తే చిత్రాలుగా మిగిలాయి.
Also Read : Kalyabni Priyadarshan : టాలీవుడ్‌కు ‘టాటా’ చెప్పేసిన ‘హాలో’ బ్యూటీ
ప్రజెంట్ అజయ్ దేవగన్ చేతిలో ‘రైడ్ 2, సన్నాఫ్ సర్దార్ 2″ ఉన్నాయి. రైడ్ 2 ఎప్పుడో కంప్లీట్ కాగా, లాస్ట్ ఇయరే విడుదల చేయాలనుకున్నారు. గత ఏడాది నవంబర్ 15 అనుకుంటే అప్పుడు సెట్ కాలేదు. ఈ ఇయర్ ఫిబ్రవరి 21కి పోస్ట్ పోన్ చేశారు. పోనీ అప్పుడైనా రిలీజయ్యిందా అంటే అప్పుడు కూడా విడుదలకు నోచుకోలేదు. రెండు సార్లు వాయిదా పడి మే 1న రైడ్ 2 థియేటర్లను నాక్ చేయబోతుంది. ఇందులో యాంటోగనిస్టుగా కనిపించబోతున్నాడు రితేష్ దేశ్ ముఖ్. రీసెంట్లీ రితేష్ లుక్ రివీల్ చేశారు. వాణి కపూర్ హీరోయిన్. ఇదిలా ఉంటే ఇప్పుడు మే 1న రిలీజ్ చేయడం సాహసంగా చెప్తున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌కు వెళ్లే టైంతో పాటు ఎండలు మండిపోతుంటాయి. దీంతో ఆక్యుపెన్సీ రేట్‌పై ప్రభావం చూపుతుంది. బట్ కంటెంట్ బాగుంటే ఓకె కాని తేదవ్ వస్తే పోస్టర్ ఖర్చులు కూడా రావు. రిస్క్ అని తెలిసి కూడా రైడ్ 2 టీం థర్డ్ టైం మనసు మార్చుకుంటుందో లేక అనుకున్న టైంకి సినిమా తీసుకువస్తుందో చూడాలి.