Rahul Ravindran : రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ అనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈయన. తాజాగా ఓ ఇంటర్యూలో తన భార్య తాళిబొట్టు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి ఆడవారి సమస్యలపై ఎప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటుంది. మీటూ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. ఇండస్ట్రీలో, సమాజంలో మహిళలపై జరిగే దాడులు, వివక్ష మీద ఆమె ఎవరికైనా ఎదురెళుతుంది. అప్పుడప్పుడు స్టార్ హీరోలు, డైరెక్టర్ల మీద కూడా సంచలన కామెంట్లు చేసిన విషయం మనం చూశాం. ఇక రాహుల్ కూడా కొంచెం అలాంటి దారిలోనే వెళ్తున్నట్టు ఉన్నాడు.
Read Also : Madhuri : వాడు పశువుతో సమానం.. భరణితో ట్రోల్స్ పై స్పందించిన మాధురి..
ఆయన మాట్లాడుతూ.. నా భార్యను పెళ్లి అయిన తర్వాత తాళిబొట్టు వేసుకోవడం, వేసుకోకపోవడం ఆమె ఇష్టం అని చెప్పేశాను. ఎందుకంటే అది పూర్తిగా ఆమె స్వేచ్ఛ, ఇష్టాలకు సంబంధించింది. కచ్చితంగా వేసుకోవాలి అని చెప్పే రైట్ నాకు లేదు. నేను అయితే ఆమెను తాళిబొట్టు వేసుకోవద్దు అనే చెప్తాను. ఎందుకంటే ఆడవారికి తాళిబొట్టు ఉన్నట్టు మగవారికి ఏమీ లేవు కదా. అది కూడా నా దృష్టిలో ఒక రకమైన వివక్ష లాంటిదే. మహిళలను సంప్రదాయాల పేరుతో అణచివేయాలని చూడొద్దు అన్నాడు. ఆయన కామెంట్లపై రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. తాళిబొట్టు అనేది మన సంప్రదాయం అని.. దాన్ని ఇలా అవమానించొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అది వివక్ష ఎలా అవుతుందంటున్నారు.
Read Also : IND vs PAK: నవంబర్ 16న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!