రాఘవ లారెన్స్ అనగానే దెయ్యాలు, ఆత్మలు గుర్తొస్తాయి. ముని సినిమా నుంచి మొదలైన ఈ ట్రెండ్ మీమ్స్ కారణంగా మరింత పెరిగింది. లారెన్స్ అనగానే ఆత్మలకి తన శరీరం ఇచ్చి పగ తీర్చుకోమంటాడు అనే మీమ్స్ చాలానే ఉన్నాయి. ఈ కారణంగా లారెన్స్ ఒరిజినల్ ఐడెంటిటీ అయిన డాన్స్ ని ఈ జనరేషన్ ఆడియన్స్ మర్చిపోతున్నారు. హీరోగా మారిన తర్వాత లారెన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు కానీ అవన్నీ కాంచన సీరీస్ లోనే. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ‘రుద్రన్’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో రుద్రుడు అనే పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీని కథిరేషన్ డైరెక్ట్ చేశాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన రుద్రుడు మూవీ నుంచి ‘ప్రాణాన పాటలే పాడుతుంది’ అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ కి శ్రీధర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. లారెన్స్ డాన్స్ లోని గ్రేస్ ని, స్టైల్ ని చూపిస్తూ కంపోజ్ చేసిన స్టెప్స్ ఇంప్రెస్ చేశాయి. సాంగ్ కూడా డబ్బింగ్ పాటలా లేకుండా స్ట్రెయిట్ తెలుగు సాంగ్ లానే ఉండడంతో వినడానికి కంఫర్ట్ గా ఉంది. నిజానికి ఈ పాట తమిళ క్లాసిక్ సాంగ్ ని రీమేక్ వెర్షన్. సాంగ్ స్టార్టింగ్ లో వచ్చిన ర్యాప్ కాస్త ఇబ్బందిగా అనిపించింది కానీ సాంగ్ స్టార్ట్ అయ్యాక మాత్రం కూల్ గా వెళ్లిపోయింది. లారెన్స్ లాంటి డాన్సర్ పక్కన ప్రియా భవాని శంకర్ కూడా డాన్స్ బాగానే వేసింది.
One of my favourite Evergreen Classic Remix Song #Rudhran first single #PraanaanaPaatalePaaduthundi's Out Now🔥🕺
Watch Here – https://t.co/nkcGjspjT3Song Composed By @dharankumar_c 🎵
Singer : @Nithyashreeoff 🎤 pic.twitter.com/X9EYjq2bTm— Raghava Lawrence (@offl_Lawrence) February 11, 2023