‘ఫస్ట్ నైట్’ గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసే దాకా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై వివాదం నడుస్తోంది. రచితా రామ్ తన కన్నడ చిత్రం “లవ్ యూ రాచు”ను ప్రమోట్ చేస్తున్నప్పుడు విలేకరుల సమావేశంలో ఇటీవల చేసిన కామెంట్స్ వల్ల ఆమె కన్నడ క్రాంతి దళ్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలోని బోల్డ్ సన్నివేశాల గురించి, అలాంటి సన్నివేశాలు చేయడంపై ఆమె అభిప్రాయాల గురించి ఓ జర్నలిస్ట్ రచితను ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నకు స్పందించిన రచితా రామ్ సమాధానమిస్తూ.. ”ఇక్కడ పెళ్లయిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు.. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సాధారణంగా పెళ్లి తర్వాత ఏం చేస్తారో చెప్పండి?” అని అడిగింది. జర్నలిస్ట్ తిరిగి సమాధానం ఇవ్వబోతుండగా “రొమాన్స్ చేస్తారు. కరెక్ట్ కదా ? అదే చిత్రంలో చూపించాము” అంటూ తాను సినిమాల్లో బోల్డ్ కామెంట్స్ చేయడాన్ని సమర్థించుకుంది.
Read Also : టాలీవుడ్ కు అచ్చిరాని నవంబర్
కన్నడ క్రాంతి దళ్ అధ్యక్షుడు తేజస్వి నాగలింగస్వామి రచిత అటువంటి ప్రకటనలు చేయడంపై మండిపడుతూ ఆమెపై నిషేధం విధించాలని ఫిల్మ్ ఛాంబర్ కు రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ‘లవ్ యూ రాచు’ చిత్రం విడుదలకు అనుమతించబోమని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ప్రముఖ నటీమణులు ఎప్పుడూ ఇలాంటి విషయాలు బహిరంగంగా చెప్పలేదు. రచితా రామ్ ఇండస్ట్రీకి కొత్త, శాండల్‌వుడ్ కు పెద్దగా పరిచయం లేదు. ఆమె చాలా అసభ్యంగా మాట్లాడి పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీసింది” అంటూ ఫైర్ అయ్యారు. శంకర్ రాజ్ దర్శకత్వం వహించిన “లవ్ యూ రాచు” చిత్రంలో కృష్ణ అజయ్ రావు కూడా నటించారు.