అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దక్షిణాది కంటే ఉత్తరాదిన ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ లేని బన్నీ ఈ సినిమాతో ఒక్క సారిగా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో వెంటనే సెకండ్ పార్ట్ ను కూడా స్క్రీన్ పై కి తెచ్చారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలనుకున్నాడు అల్లువారి అబ్బాయి. అయితే ‘పుష్ప’ ఘన విజయంతో టోటల్ ప్లాన్ ఛేంజ్ అయింది. ఇప్పుడు ‘పుష్ప2’ ట్రాక్ ఎక్కనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే బిజినెస్ పరంగా వీరలెవల్లో ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. హిందీ వెర్షన్ డీల్ క్లోజ్ చేసేందుకు పలు బాలీవుడ్ కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో అల్లు అర్జున్ పారితోషికం కూడా భారీగా పెరిగింది. అంతే కాదు బిజినెస్ లోనూ వాటాలు దక్కనున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం బన్నీకి ‘పుష్ప2’ ద్వారా వంద కోట్లకు పైగా ముట్టనున్నట్లు వినికిడి. ఇక సుకుమార్ కి సైతం ఈ ప్రాజెక్ట్ కోసం 45 నుండి 50 కోట్ల రెమ్యూనరేషన్ దక్కనుందట. దీంతో హీరో, దర్శకుడు, ఇతర నటీనటుల పారితోషికాలే 200కోట్లు దాటనున్నాయని టాక్. ఇక మేకింగ్ తో పాటు ప్రచారానికి కలిపి మరో 150కోట్లు వరకూ కావచ్చని వినిపిస్తోంది. అంటే ‘పుష్ప2’ మొత్తం బడ్జెట్ దాదాపు 350 కోట్ల వరకూ అవుతుందంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ యమ స్పీడ్ గా జరుగుతోంది. మరి ఈ భారీ బడ్జెట్ మూవీ బన్నీకి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందో చూడాలి.