Pushpa 2 : అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప తరువాత పుష్ప 2 ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఎక్కడ విన్నా పుష్ప 2 ఎప్పుడు మొదలవుతుంది అనే మాటే. ఎట్టకేలకు దానికి సమాధానం వచ్చేసింది. పుష్ప 2 ఆగస్టు 22 న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు.
ఇక దీంతో బన్నీ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపిస్తుండగా.. మరో స్టార్ హీరో కూడా రెండో పార్టీ లో నటిస్తున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప రాగా అంతకుమించిన కథను పుష్ప 2 కోసం రెడీ చేశాడట సుకుమార్. మరి రేపు ఈ పూజా కార్యక్రమానికి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారో చూడాలి. పాన్ ఇండియా మూవీగా మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి పుష్ప 2 రాబోతున్నది.