ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న “పుష్ప: ది రైజ్” ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీ అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. తాజాగా “పుష్ప: ది రైజ్” సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం దాదాపుగా 3 గంటలు ఉన్నట్టు సమాచారం. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు ఎదుర్కొని సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచడమే మిగిలి ఉంది.
Read Also : కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్
కొద్ది రోజుల క్రితం “పుష్ప” మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసారు. బన్నీ స్పెషల్ అప్పియరెన్స్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. ఇక “పుష్ప: ది రైజ్”లో విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్, సునీల్ కనిపించబోతున్నారు. “ఊ అంటావా ఉహూ అంటావా” అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ లో సమంత రూత్ ప్రభు కనిపించనుంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ స్పెషల్ నంబర్ ప్రోమో ఈరోజు విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.