Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నేడు తన 27 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికను పాన్ ఇండియా హీరోయిన్ గా మార్చింది పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక పేరు మారుమ్రోగిపోయింది. శ్రీవల్లీగా అమ్మడి నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రగా మారిపోయింది. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్, రష్మిక డీ గ్లామరస్ గా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి ఇంటర్వ్యూల్లో రష్మిక.. ఈ సినిమాలో శ్రీవల్లీగా కనిపించడానికి తనకు చాలా మేకప్ వేశారని, నల్లగా కనిపించాలని స్పెషల్ మేకప్ వేసినట్లు చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టే ఆమెకూడా కష్టపడినట్లు తెలిపింది. ఇక ఈ సినిమా తరువాత రష్మిక.. శ్రీవల్లీగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లినా సామి సామి స్టెప్ వెయ్యడం రష్మికకు అలవాటుగా మారిపోయింది. మొన్న జరిగిన ఐపీఎల్ స్టేజిమీద కూడా అమ్మడు పుష్ప సాంగ్స్ కు స్టెప్పులు వేసి అదరగొట్టింది.
Upasana Konidela: ఉపాసన సీమంతం.. రంగరంగ వైభవమే
ఇక ఈ సినిమా తరువాత అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తుంది పుష్ప 2 కోసం. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి శ్రీవల్లీ పాత్ర గురించి వచ్చిన రూమర్స్ మరి ఇంకేదానికి రాలేదు. శ్రీవల్లీ పాత్ర చనిపోతుంది ఆమె ప్లేస్ లో ఇంకో హీరోయిన్ ఉందని వార్తలు గుప్పుమన్నాయి. అలాంటిదేమి లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు అభిమానులు ఆ రూమర్స్ ను ఆపలేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా శ్రీవల్లీ కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి.. ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. గ్రీన్ కలర్ లంగా, రెడ్ కలర్ వోణి.. లూజ్ హెయిర్ తో శ్రీవల్లీ పుష్పకే కాదు అభిమానులందరికీ పులుపెక్కిస్తోంది. అయితే ఈ పోస్టర్ లో శ్రీవల్లీ తెల్లగా మిలమిల మెరిసిపోతుంది. మొదటి పార్ట్ లో డీ గ్లామరస్ గా కనిపించిన ఆమె.. ఇప్పుడు ఇలా కనిపించేసరికి నెటిజన్లు సరదాగా ఏడిపిస్తున్నారు. ఏంటి.. శ్రీవల్లీ.. ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నావా.. అంత తెల్లగా అయినావ్ అని కొందరు. పుష్ప 1 లో ఏదోలా ఉండేది.. ఇప్పుడేంటిరా ఇంత అందంగా ఉంది అంటూ మీమ్స్ వేసి ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.