‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ సమంత సాంగ్ దుమ్మురేపుతోంది. పుష్ప చిత్రంలో సామ్ ఐటెం సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ఊర మాస్ సాంగ్ కి ఊర మాస్ స్టెప్పులు వేసి అల్లాడించింది. ఇక ఈ లిరికల్ వీడియో అయితే రికార్డుల మోత మోగిస్తుంది. లిరిక్స్ కొద్దిగా మగవారికి ఇబ్బందికరంగా ఉన్నా మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేవారు ఈ మాత్రం లిరిక్స్ ని పట్టించుకోకుండా సామ్ స్టెప్స్ ని, మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు పురుషుల మనోభావాలు దెబ్బతీశారు, అమ్మాయిలు మాత్రం తక్కువా అంటూ ఈ సాంగ్ కి మేల్ వెర్షన్ క్రియేట్ చేసి ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సరిపెట్టుకొంటున్నారు.
తాజాగా ‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేల్ వెర్షన్ నెట్టింట వైరల్ గా మారింది. ఒరిజినల్ పాటలో ఉన్న ఆ పదాలనే మార్చి మగ ప్లేస్ లో ఆడ అని మార్చి పాడిన ఈ పాట ఆకట్టుకొంటుంది.. ‘‘మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’’ అంటూ పాడిన ఈ పాటకు టాలీవుడ్ స్టార్ హీరోల సాంగ్స్ ని మషప్ చేసి మ్యూజిక్ కి తగట్టు స్టెప్స్ ని ఎడిట్ చేశారు. మెగాస్టార్ చిరు నుంచి పవన్ కళ్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ మాస్ స్టెప్పులతో ఈ క్లిప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే పుష్ప డిసెంబర్ 17 న థియేటర్లలో అడుగు పెడుతోంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఈ పాట థియేటర్లో ఎంతటి హంగామా చేస్తుందో చూడాలి.
Fun male version of #OoAntavaOoOoAntava 😀 #Pushpa pic.twitter.com/hIeOFjfS2s
— Vaali (@vaaalisugreeva) December 15, 2021